ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. డిమాంటి కాలనీ 2 చిత్ర యూనిట్ గురువారం విశాఖ మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్లో సందడి చేసింది. కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత సురేష్ రెడ్డి హాజరయ్యారు.