వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి

60చూసినవారు
ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్ చార్జీలను రూ. 2500కు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వసతి గృహాల్లో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక పలు అవస్థలు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల కాస్మెటిక్స్ చార్జీలను విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్