గాజువాక నియోజకవర్గం నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విశాఖపట్నంలో శుక్రవారం పర్యటించారు. నియోజకవర్గంలో 86 ఆటో స్టాండ్ లో యూనియన్ భాగస్వామ్యంతో నేడు శాంతియుత ర్యాలీ చేస్తున్న విషయం తెలుసుకొని ఆమె యూనియన్ వ్యవస్థాపకులతో భేటీ అయ్యారు. అనంతరం యూనియన్ వ్యవస్థాపకులు గొలగాని అప్పలరాజు తమ సమస్యలను తెలుపుతూ వినతిపత్రాన్ని ఆమెకు అందజేశారు.