నవోదయ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలి

70చూసినవారు
నవోదయ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలి
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారామ్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేటప్పుడు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. సోమవారంతో గడువు ముగియనున్న నేపధ్యంలో పొడిగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్