ఉత్తరాంధ్ర పై ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపినట్టు కనపడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా సిఎం హోదాలో విశాఖ వచ్చినపుడు భవిష్యత్తు కార్యక్రమాలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ జగన్ పై విష ప్రచారం చేయడం అజెండాగా పెట్టుకున్నారన్నారు.