విశాఖ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ విభాగంలో తుఫాను కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891 - 2590102, 0891 - 2590100 ఫోన్ నంబర్లతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.