రావికమతం మండలం మేడివాడ, గర్నికం సచివాలయ పరిధిలోని పాడిపశువులకు గురువారం గాలికుంటు వ్యాధి టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పశు విజ్ఞాన సదస్సులో తట్టబంద ఇన్చార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ నూకేశ్వర్ రావు వేసవి కాలంలో పాడి పశువుల యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గర్నికం సర్పంచ్, అంబులెన్స్ వైద్యులు డాక్టర్ మురారి, 24 మంది పాడి రైతులు అసిస్టెంట్ రాధ మరియు సిబ్బంది పాల్గొన్నారు.