గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు

161చూసినవారు
గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పాడి పశువుల లో గర్భస్రావం, పెయ్యల్లో మరణాలు, ఉత్పత్తిలో తగ్గుదల మొదలగు దుష్పరిణామాలకు గాలికుంటు వ్యాధి కారణమవుతోంది. ఇటువంటి అననుకూల ప్రభావాలకు ముఖ్య కారణమైన గాలికుంటు వ్యాధిని 2025లోగా నివారించుటకు మరియు 2030లోగా దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించుటకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

రావికమతం మండలం రూరల్ గ్రామాల్లో పాడి పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఎంపీపీ పైల రాజు మంగళవారం తోటకూరపాలెంలో ప్రారంభించారు. గ్రామాల్లో కూడా ఈరోజు పశు వైద్య శిబిరం నిర్వహించి వేరువేరు బృందాలతో టీకాలు వేయడం జరిగింది. గోపాలమిత్రలు, సచివాలయ పశుసంవర్ధక సహాయకుల బృందాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తట్టబంద మరియు కొత్తకోట పశు వైద్యులు డాక్టర్ నూకేశ్వర రావు మరియు డాక్టర్ బాల తేజ పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్