విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ స్కూల్లో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, మహిళా టీచర్స్ కి, గ్రామ మహిళ సర్పంచ్, వైస్ సర్పంచులకు స్కూల్ కమిటీ వారు సన్మాన కార్యక్రమం చేసి ఉన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ.. స్త్రీ గొప్పతనాన్ని, సమాజంలో స్త్రీ పోషిస్తున్న బాధ్యతలు వివరంగా విశదీకరిస్తూ, తోటి మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ వారు, గ్రామ పెద్దలు పాల్గొని మహిళా శుభాకాంక్షలు తెలియజేశారు.