అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం తుతంగి పంచాయతీ, గ్రామానికి చెందిన పూజారి రంగారావు, కుమారిల నాల్గవ పుత్రిక (16) ఈ మధ్యనే పదవ తరగతి పరీక్షలు పూర్తిచేసుకుని తమ ఇంటికి వచ్చినది. అయితే సోమవారం వేకువజామున రెండున్నర గంటలకు వాళ్ల కుటుంబీకులు నిద్రలో ఉండగా తను లఘుశంక కని బయటకు వెళ్లి ఆ తర్వాత తను ఇంటికి రాలేదు. అయితే నిద్రనుంచి మేల్కొన్న తల్లిదండ్రులు తను లఘుశంకకు వెళ్లి ఇంకా రాలేదేమోనని.. అయితే తను వస్తుందేమోనని గాభరా పడలేదు. కానీ సమయం మించిపోతున్నా తను రాలేదు. వెంటనే తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్నటువంటి తమ స్నేహితులకు బంధువులకు విచారించగా తమకేమి తెలియదని తెలపడంతో కంగారుపడిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ డుంబ్రిగూడ నందు ఫిర్యాదు చేశారు.