AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలోని రామకుప్పం మండలంలో పర్యటించారు. మొద్దులవంక గ్రామం, గాంధీనగర్‌లో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు డప్పు వాయిద్యాలు, జానపద గీతాలతో గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం విజలాపురంలోని కస్తూర్బా పాఠశాలను భువనేశ్వరి సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.