అనాథలకు సహాయం

939చూసినవారు
అనాథలకు సహాయం
తనకున్న దాంట్లో ప్రతి నెల మండలంలోని పాత వలస గ్రామంలో ఉన్న కల్పవల్లి అనాధాశ్రమానికి ఏదో ఒక రూపంలో తనకు కలిగిన దాంట్లో సాయం అందిస్తున్నానని, అనకాపల్లి జిల్లా, కె కోటపాడు మండలం, కింతాడ పంచాయతీ శివారు మెరకరామచంద్రపురం గ్రామానికి చెందిన శ్రీ గంగా దేవి కన్స్ట్రక్షన్ మేస్త్రి బండారు అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కల్పవల్లి అనాధాశ్రమానికి వెళ్లి అనాథ పిల్లలకు రైస్ బ్యాగును అందించారు.

తన పిల్లలు ఇద్దరు కుమార్తెలు ఎల్లవేళలా అభివృద్ధిలోకి రావాలని, ఈ నిర్ణయం తీసుకుని, అనాధ పిల్లలు మా పిల్లలు వలె బాగుండాలని, ఈ చిరు ప్రయత్నం చేస్తున్నానన్నారు. అనంతరం బియ్యం బస్తాను పిల్లలకు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సన్నీ కుబిరెడ్డి. విద్యార్థులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్