మదర్ హెల్ప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యలమంచిలిలో గల ప్రేమ సమాజం ఆశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగను పురస్కరించుకొని మదర్ హెల్ప్ ట్రస్ట్ వారు ఆశ్రమానికి 50 కేజీల బియ్యం, కూరగాయలు మరియు దీపావళి టపాసులు పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.