గూడెంకొత్తవీధి మండలం: ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు, బహుజనుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతి సందర్భంగా వేడుకలను సోమవారం న మన్యపుత్ర యువజన సంఘ అధ్యక్షుడు మడపల సోమేష్ కుమార్ (ఉప సర్పంచ్) రింతాడ పంచాయితీ హెడ్ క్వార్టర్ వద్ద ఉన్న గ్రంథాలయం, రింతాడ, ఊబపొలం గ్రామంలో మరియు స్కూలు పిల్లలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పూలే- అంబేద్కర్ జయంతి సందర్భంగా పిల్లలకు జై భీమ్ జ్ఞాన కార్యక్రమాలు నాలుగు రోజులు లు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.
మన్య పుత్ర యువజన సంఘం అధ్యక్షులు సోమేష్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితం ఒక చారిత్రక పరిణామానికి ప్రతీక. బానిస భావజాలాన్ని ప్రతిఘటించిన సామాజిక విప్లవకారుడు సామాజిక కార్యకర్త. బానిసత్వం పోరాటమే ప్రధాన కర్తవ్యంగా, ప్రజలను చైతన్యపరిచి పోరాటం నడిపించిన మహనీయుడు జీవిత చరిత్రను ప్రశంసిస్తూ, ఆనాటి సమాజంలో ఎన్నో త్యాగాలు చేసి బహుజన బహుజన వర్గాల స్త్రీలకు ఎన్నో హక్కులు కల్పించారు. ఆనాడు మెజారిటీ ప్రజలకు విద్య లేకపోవడం ఒక సమస్య. అయితే నేడు అందరికీ సమాన విద్య లేకపోవడం పెద్ద సమస్య. దేశంలోని ఉన్నవాళ్లకు ఒక విద్య, లేనోళ్లకు మరొక విద్య కొనసాగిస్తూ ప్రజల మధ్య అసమానతలు తొలగించాల్సిన పాలకులు అసమానతలకు పెంపునకు కారణమవుతున్నారు. ఇప్పుడు చెప్తా ప్రజలకు ప్రజలను విద్యకు దూరం చేసి తద్వారా అభివృద్ధికి దూరం చేయడం వల్లే నేడు దేశంలో దుర్భర పరిస్థితి కొనసాగుతుంది. కావున ప్రతి ఒక్కరు జీవించడానికి ఆహారం ఎంత అవసరమో మనిషి గొప్ప వ్యక్తి కలిగి ఉండటానికి విద్య అంత అవసరం కావున ప్రతి ఒక్కరు ఆహారంతో పాటు విద్య కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహాత్మ జ్యోతిరావు పూలే సిద్ధాంతం, పనితీరు, అంకితభావం, ఆశయసాధనలో ప్రజలు, యువత స్పూర్తిదాయకంగా కావాలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మన్య పుత్ర యువజన సంఘ సభ్యులు ప్రకాష్, చంద్రశేఖర్, రాజు రింతాడ సచివాలయం 2 కార్యదర్శి సోమేశ్, రింతాడ, ఊబపొలం గ్రామ ప్రజలు, మహిళలు, వాలంటీర్స్ మరియు స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.