రింతాడ పంచాయితీ హెడ్ క్వార్టర్ లో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి సూచన మేరకు ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉష, స్థానిక వైసిపి నాయకులు నిర్మాణపు పనులను పర్యవేక్షించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణపు పనులు నాణ్యతా ప్రమాణాల ప్రకారం చేయాలని కాంట్రాక్టర్ ను సూచన చేశారు. తదనంతరం ఇంటింటికి కుళాయిల పైపు లైనులను పరిశీలించారు. వైసిపి నాయకులు బొబ్బిలి వెంకటరావు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.