అంతర్రాష్ట్ర రహాదారి మీద రాకపోకలను నిలిపేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు, జిల్లా కన్వీనర్ రామరావుదొర బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వివరాలల్లోకి వెళితే అల్లూరి జిల్లాలో గల ఆర్వీనగర్ నుండి పాలగెడ్డ వరకు రహాదారి పూర్తిగా శిదిలమైపోయిందని గత కొంతకాలంగా వినతులు, విన్నపాలు, ఆందోళనలు, ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడంతో ఆదివాసి జెఏసి ఆద్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు పాదయాత్ర చేసిన తర్వాత అటవీశాఖ అనుమతులు లేవని సింగిల్ లైన్ బిటిరోడ్డు వేస్తామని ఆర్ అండ్ బి అధికారులు అన్నారు, కానీ కొంతమేరకే రోడ్డు వేసారు. రోడ్డంతా గోతులు ఉండడంతో ప్రయాణీకులు నరకం చూస్తున్నారు. ఇలాంటి దిక్కులేని పరిస్థితులలో మరొక్కసారి నిరసన తెలపడానికి ఆదివాసీ జెఏసి సిద్దపడిందని, ఆ రహాదారి నిర్మించేవరకు త్వరలోనే రాకపోకలను ఆపేస్తామని హెచ్చరించారు. రాకపోకలను ఆపేయడానికి అందరూ సిద్దంగా ఉండాలని కోరారు.