లారీ-బొలెరో ఢీ..హైవేపై బోల్తా పడ్డ రెండు వాహనాలు

26248చూసినవారు
పాయకరావుపేట, నక్కపల్లి జాతీయ రహదారిలో శుక్రవారం కెమికల్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి సీడ్ లోడ్ తో వస్తున్న బొలొరో వాహనం ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలు జాతీయ రహదారిపై బోల్తా పడ్డాయి. బోలోరా వాహనంలోని డ్రైవర్ క్లీనర్ కు తీవ్ర గాయాలు తగిలాయి. డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉన్నారు. లారీలోని డ్రైవర్ క్లీనర్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం నుండి పరారయ్యారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్