వరుణ దేవుని కరుణ కోసం అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట అన్నదాత ఇంటికి చేరే వరకు వేసే ప్రతి అడుగు అడుగునా కష్టాలు కడగండ్లే. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందంటే చాలు తొలకరి పులకరించడంతో చిగురించిన ఆశలుతో ఏరువాక పట్టి పొలం దున్ని దమ్ము పట్టి విత్తనం విత్తి మొలకెత్తే దాకా అనుక్షణం భద్రంగా కాపాడుతూ.. పకృతినే ఆరాధిస్తూ వరుణుడు కరుణ కోసం అనుక్షణం ఆశగా ఎదురు చూస్తున్న రైతుకు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే కష్టాల కాలం మొదలైంది.
నారు పోసిన రైతుకు మీరు లేక అల్లాడిపోతున్న వైనమిది. నదులు వాగులు వంకలు పొంగి పంటకాలువలలో నిండుగా నీరు పారుతూ దమ్ము పెట్టేందుకు మీరు మల్ల లో చేరితే ఆ రైతు ఆనందం మాటల్లో చెప్పలేనిదే. కానీ ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరుణుడు కరుణించక పోవడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూ వరుణ దేవునీ కరుణ కోసం నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నారుమళ్లు నీరు లేక వెలవెలబోతున్న వేళ దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ నడుస్తున్నప్పటికీ నారుమళ్లు ఎదుగుదలకు అవసరమైన వర్షం లేకపోవడంతో ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కేవలం బోరుబావుల ఆధారిత ప్రాంతాల్లో మాత్రమే నాట్లు వేసే పరిస్థితి ఉంది.
విశాఖ జిల్లాలో ఒక లక్షా రెండు వేల హెక్టార్లలో మొత్తం విస్తీర్ణం సాగు చేస్తారు రైతులు. ఖరీఫ్ సీజన్ జూలై చివరి నాటికి కల్లా సుమారుగా చట్టాలలో సాధారణంగా వరి నాట్లు పడేవి. కానీ కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 15269 హెక్టార్లల్లో మాత్రమే ఇప్పటివరకు నాట్లు జరిగినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సాధారణ వర్షపాతం నమోదు ఇప్పటివరకు 268. 3 మిల్లీమీటర్లు గా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఖరీఫ్ సీజన్లో జూలై నెలాఖరు నాటికి 342. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా తక్కువ నమోదు కావడంతో వరి నాట్లు కూడా జరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతున్నప్పటికీ వరుణుడు కరుణించక పోతే వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రోజుల పెరిగేకొద్దీ బ్రతికున్న కొద్ది నారుమళ్లులో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వాటిని సంరక్షించుకోవడం కత్తి మీద సాములా మారుతోంది రైతులకు. చినుకు జాడ లేక అర్రులు చాచి ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుకు ఆ దేవుడే దిక్కు.