ఏపీలో YS జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు పేరు వినిపిస్తోంది. వైఎస్సార్ బతికున్న సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కేవీపీకి సమాచారం ఉందని చర్చ జరుగుతోంది. అయితే జగన్, షర్మిల ఆస్తుల కోసం రోడ్డెక్కడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అన్ని తెలిసిన కేవీపీ ఎవరికి సపోర్ట్ చేస్తారా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.