చినుకు పడితే చిత్తడే.. !

957చూసినవారు
ఎలమంచిలి మున్సిపాలిటీలో గల పెద్దపల్లి రోడ్డు మరమ్మతులు గురై గుంతల మయంగా మారింది. రోడ్డు వేసి ఏళ్లు గడుస్తున్నా గాని అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో.. కొద్దిపాటి వర్షం పడిన ఎక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. రోడ్డుపై పిక్కలు తేలి వాహనదారులు, ఆటోవాలాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కోసం ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపల్లి రోడ్డు మరమ్మతులు గురైన ఎవరూ పట్టించుకోకపోవడంతో 7 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి, మంత్రిపాలెం పెదగొల్లపాలెం, చినగొల్లలపాలెం, వెంకటాపురం నవాబుపేట, శేషు కొండ కాలనీ ప్రజలు నిత్యంనరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీఅధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్