అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా, ఎస్.పి. కార్యాలయం ఆవరణలోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి. దయానిధి, ఆర్డీవో షేక్ ఆయిషా పాల్గొన్నారు.