విశాఖపట్నం జిల్లలోని అనకాపల్లి డిపోకి చెందిన బస్సులో ప్రయాణికులు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మంగళవారం సాయంత్రం 4: 30 కీ అనకాపల్లి నుండి విజయనగరం వెళ్ళే బస్ మొదలయ్యింది. అయితే పెందుర్తి దగ్గర నుండీ వర్షం మొదలయ్యింది. అప్పటి నుండీ ప్రయాణికులు కష్టాలు మొదలయ్యాయి. అయితే బస్సుకు సైడ్ అద్దాలు లేక వర్షం నీరు నేరుగా బస్ లోకి వచ్చి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ధర చెల్లించి మరీ సౌకర్యంగా కూర్చోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.