
అనకాపల్లి: 62 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి నుంచి సూర్యపేటకు వెళ్తున్న కారులో గంజాయి గుర్తించారు పోలీసులు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద బుధవారం ఉదయం ఈ గంజాయిని పట్టుకున్నారు. 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు.