ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
అనంతగిరి మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి చెరుకుబిడ్డ కరివేసు వంజలవలస ఈతమానువలస పరిసర ప్రాంతంలో ఈదురుగాలులతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మూడు నెలలుగా వడగాల్పులు ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు మంగళవారం ఉదయం గంటలపాటు కురిసిన భారీ వర్షంతో ఉపశమనం లభించింది. ఈ వర్షంతో పలు గ్రామాల మట్టి రోడ్లు బురదమయమయ్యాయి. ఉపాధి హామీ పథకం కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.