మోకాళ్లపై నిరసన తెలిపిన విద్యార్థులు
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని వెంగాడ పంచాయతీ పరిధి డొంకపుట్టులో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు మోకాళ్ళ పై వినూత్న నిరసన తెలిపారు. పాఠశాల భవనం లేక చిన్న రేకు షెడ్డులో ఎండ, వానకు ఇబ్బందులు పడుతూ 40మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నామన్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు.