అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక డోలిమోతల మరణాలు నేటికీ తగ్గడం లేదు. అనంతగిరి మండలంలోని గుమ్మా పంచాయతీలోని కర్రిగుడకి చెందిన బడ్నాయిని. సుక్రమ్మ మంగళవారం నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతుండగా గురువారం ఉదయం కుటుంబీకులు డోలికట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో 15మంది గిరిజనులు వాంతులు విరోచనాలతో బాధతున్నారని తెలిపారు.