అనంతగిరి: గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-1లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి గంగరాజు పాల్గొన్నారు. అంబేద్కర్ 2 సంవత్సరాలు 11నెలలు 18రోజుల్లో 470 ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారని అన్నారు. విద్యార్థినులు చదువుల్లో చక్కగా రాణించి అంబేద్కర్ బాటలోనే మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విమల కుమారి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.