అనంతగిరి: రహదారి కల్వర్టు నిర్మాణ పనుల పరిశీలన

76చూసినవారు
అనంతగిరి: రహదారి కల్వర్టు నిర్మాణ పనుల పరిశీలన
అనంతగిరి మండలంలోని గుమ్మకోట పంచాయితీ గుమ్మకోట గ్రామానికి నూతనంగా నిర్మాణం చేపడుతున్న రహదారితో పాటు కల్వర్టు నిర్మాణ పనులను బిజెపి జిల్లా అధ్యక్షుడు జిసిసి రాష్ట్ర డైరెక్టర్ పాంగి రాజారావు బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత గుత్తేదారుని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిజెపి నాయకులు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్