అరకులోయ ఏపీఆర్(బాలికలు) కళాశాల విద్యార్ధిని పాడేరు కు చెందిన సిరిమల్ల ఛాయాదేవి 963 మార్కులు సాధించి టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి శనివారం తెలిపారు. విద్యార్ధిని తల్లి విజయలక్ష్మి గృహిణి కాగా తండ్రి ప్రసాద్ జీపు డ్రైవర్ గా పనిచేస్తూ ఛాయాదేవిని చదివిస్తున్నారు. అరకులోయ ఏపీఆర్(బాలురు) కళాశాల బైపీసీ విద్యార్ధి వంతాల శ్రీకాంత్ 962 మార్కులతో మండల ద్వీతీయ స్ధానం పొందాడు. శ్రీకాంత్ ది పెదబయలు మండలం గడెపల్లి గ్రామం.