అరకు: మరింత పెరిగిన చలి తీవ్రత

55చూసినవారు
అరకులోయలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల వల్ల ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్ లైట్ లు వేసుకొని  రాకపోకలు కొనసాగించారు. రాత్రి వేళల్లోనే కాదు పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతుండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజగజ వణుకుతున్నారు. పొద్దుపొద్దునే పక్షులు కిలకిలరాగాలతో మనసుకు ఆహ్లాదనిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్