అరకు: కొనసాగుతున్న పొగమంచు తీవ్రత

70చూసినవారు
అల్లూరి జిల్లా అరకు లోయ మన్యంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9గంటల వరకు అరకులోయ మండల పరిసర గ్రామాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీనితో రహదారులు కనిపించక వాహనదారులు హెడ్లైట్లేసుకొని రాకపోకలు కొనసాగించారు. కొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూనే ఉండడంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్