డుంబ్రిగుడ కేజీబీవీ కళాశాల బైపీసీ విద్యార్ధిని బురిడి దీన 852 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ కె. భవానీ శనివారం తెలిపారు. విద్యార్ధిని దీన ది అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయితీ పరిధి సంగంవలస గ్రామం. విద్యార్ధిని తల్లి గృహిణి కాగా తండ్రి బార్సు విలేకరి గా పనిచేస్తూన్నారు. డుంబ్రిగుడ కేజీబీవీ కళాశాల నుండి ఫస్ట్ ఇయర్ 89%, సెకండ్ ఇయర్ 100% విద్యార్థులు పాసైనట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.