పెదబయలు మండలంలోని రూ. 50 లక్షల ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కిముడుపల్లి నుండి సవడిమామిడి వరకు బుధవారం బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ శోభరాణి ఎంపిటిసి కాసులమ్మ పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. బీటి రోడ్డు నిర్మాణంతో సవడిమామిడి గ్రామ గిరిజనుల రవాణా కష్టాలు తీరనుందన్నారు. వార్డు సభ్యులు భీమరాజు భూలోక తదితరులు పాల్గొన్నారు.