అనంతగిరి మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కర్రిగుడలో డోలిమోతలు ఆగడం లేదు. కర్రిగుడకి చెందిన బోయిన. సన్యాసమ్మ ఆదివారం ఉదయం నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతూ స్పృహ కోల్పోయింది. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు సన్యాసమ్మను డోలికట్టి కర్రిగుడ నుండి నిమ్మఊట వరకు 8 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించామని సూపర్ సర్పంచ్ గంగరాజు తెలిపారు.