రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించిన అమనాం సహా ఇతర గ్రామాలను అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉపాధి హామీ పథకం కింద దాకమర్రి, బోడమెట్లపాలెం, అమనాంలలో రూ.77లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం అమనాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.