పంచ గ్రామాల సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య నగర పరిధిలో 6 నియోజకవర్గాలకు సంబంధించిందిగా పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. సింహాచలం రోడ్డు వైండింగ్లో స్థలాల పోయినవారికి న్యాయం చేయాలన్నారు.