కూటమి నేతలు హామీ ఇచ్చినట్లు పట్టణాలలో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గురువారం పాత మధురవాడ మెట్ట నుండి సచివాలయం వరకు ప్రజలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారని, ఆ ఇళ్లస్థలాలు నివాసయోగ్యంకాని ప్రాంతాలలో కేటాయించారన్నారు.