మధురవాడ ఐదవ వార్డు పరిధిలో కొండవాలు ప్రాంతమైన స్వయంకృషి నగర్, వికలాంగుల కాలనీ, కార్పెంటర్ కాలనీలో మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు కార్పొరేటర్ హేమలత తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నట్లు తెలిపారు. రూ. 60 లక్షలతో కొండవాలు ప్రాంతంలో నిర్మించనున్న పైప్ లైన్లకు శనివారం ఆమె భూమి పూజ చేశారు.