అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో మంగళవారం చోడవరం ఆర్ అండ్ బి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో జేఈ కుర్చీకి వినతి పత్రం అంటించి వెనుతిరిగారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అనేక రహదారుల ధ్వంసం అయ్యాయన్నారు.