నాటు సారా తయారుచేసిన అమ్మిన కఠిన చర్యలు తప్పవని చోడవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కెవి బాపు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల కె. కోటపాడు మండలం కురువాడ గ్రామంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరూ కూడా నాటు సారాయి తయారు చేయడం, అమ్మకం చేయకూడదని, చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే నాటు సారా సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు.