చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారై ఉత్తమ విద్య అభ్యసించాలని ఆశయంతో సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు.