రావికమతం.. గ్రానైట్‌ క్వారీల ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేయాలి

73చూసినవారు
రావికమతం.. గ్రానైట్‌ క్వారీల ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేయాలి
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో ఈ నెల 9న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె. గదభపాలెం వాసులంతా మంగళవారం ఆందోళన నిర్వహించారు. సర్వే నంబర్‌`1లో 3. 219 హెక్టార్ల భూమిలో అశ్రిత ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ క్వారీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మైనింగ్‌ అధికారులు బుధవారం కోట్నిబిల్లి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్