చోడవరం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్లు ఇస్తున్నారని, సూపర్ సిక్స్ అన్ని అబద్దాలేనని విమర్శించారు.