విశాఖలో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం 12 గంటల నుంచి విశాఖ నగరంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. మరో రెండు రోజులపాటు విశాఖ తో పాటు ఉత్తరాంధ్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.