విశాఖ కేజీహెచ్ లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. శుక్రవారం సాయంత్రం కేజీహెచ్‌కు వెళ్లిన ఆయన ముందుగా వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఉద్యోగుల విధి నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నపిల్లల వార్డును సందర్శించారు. ఆధునికీకరణ పై చర్చించారు.