రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రైతుభరోసా కేంద్రాలు

289చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రైతుభరోసా కేంద్రాలు
వైసీపీ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ వీడియో ద్వారా వీక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆరంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్రంలోనీ వివిధ జిల్లాల మంత్రులు,అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు,పురుగుమందులు, భూసార పరీక్షల నిర్వహణ, సిబ్సిడీ రుణాల వంటివి నేరుగా ఆయా గ్రామాల్లోనే రైతులకు అందుబాటులో వుంచటమే లక్ష్యంగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయని సిఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్