మిల్లెట్స్‌తో ఉగాది చిత్రం

84చూసినవారు
మిల్లెట్స్‌తో ఉగాది చిత్రం
విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మిల్లెట్స్ తో ప్రత్యేకమైన చిత్రాన్ని సోమవారం తీర్చిదిద్దారు. ఉగాది అనగానే గుర్తుకు వచ్చే ఉగాది పచ్చడి, కోకిల, మామిడికాయలు వంటివి ఈ చిత్రంలో ఆయన ఎంతో సహజత్వం ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. ప్రజల్లో చిరుధాన్యాల పట్ల అవగాహన పెంచాలని విజయ్ కుమార్ ఏడాదిగా ఇటువంటి చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు.

సంబంధిత పోస్ట్