విశాఖ: ఐదు ప్రవేటు బస్సులకు జరిమానా

52చూసినవారు
సంక్రాంతిని సొమ్ము చేసుకుంటున్న విశాఖప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తున్న బస్సులను చెక్‌ చేశారు. ఊహించని విధంగా ప్రయాణికుల నుంచి భారీగా టికెట్‌ ధరలు వసూలు చేయడాన్ని గుర్తించారు. మొత్తం 5 బస్సులకు జరిమానా విధించి కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్