ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంతో వారంలో 3రోజులు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పర్యవేక్షణలో 85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో అగనంపూడి పునరావాస కొలని అట్టవానిపాలేం ప్రభుత్వ పాఠశాలలో 85 వ వార్డ్ యూత్ సెక్రెటరీ గోక్యాడ సాయి మరియు సచివాలయం కన్వీనర్ బల్ల పైడిరాజు విద్యార్థులకు మంగళవారం రాగి జావా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న గోరు ముద్ద ద్వార చిన్నారులకు రుచికరమైన పౌష్టికఆహారం అందిస్తున్నామని వారు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెల్లి సుబ్బా రావు ఆధ్వక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.