గాజువాక: ప్రభుత్వ ఐటిఐలో 24న జాబ్ మేళా

84చూసినవారు
గాజువాక: ప్రభుత్వ ఐటిఐలో 24న జాబ్ మేళా
గాజువాక ప్రభుత్వ ఐటిఐలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐ చేసి అప్రెంటిస్ పూర్తయిన అభ్యర్థులకు తిరుపతిలోని అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21 వేల జీతంతో పాటు వసతి భోజన సౌకర్యం కల్పిస్తారన్నారు. వివరాలకు 9177338977 నెంబర్కు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్